This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Saturday, September 20, 2014

రేషన్ కార్డులో మార్పులు చేర్పులిలా

 కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలంటే...
 పుట్టిన పిల్లలు, వలస వచ్చిన కుటుంబ సభ్యుల పేర్లు కొత్తగా చేర్చాలంటే జనన ధ్రువపత్రం, వలస వచ్చిన వారికైతే గతంలో ఉండే ప్రాంతంలో రేషన్‌కార్డులో పేరు తొలగించే సమయంలో ఇచ్చే ధ్రువీకరణ పత్రం, కొత్త ప్రాంతానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం, ఆధార్, కరెంటు బిల్లు అఫిడవిట్ వంటివి జత చేయాలి. కొత్తగా సభ్యుల పేర్లు జత చేయడానికి  సంయుక్త కలెక్టరు ద్వారా పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు  ఆన్‌లైన్‌లో పంపుతారు. కమిషనర్ నుంచి తుది ఆమోదం లభించిన తర్వాత పేర్లు చేర్చుతారు. మొత్తం ఈ పన్నులన్నీ  మీ సేవా కేంద్రాల ద్వారా జరుగుతాయి. మండల స్థాయిలో అయితే తహశీల్దార్ వీటిని జారీ చేస్తారు.  

 కార్డు సరెండర్ చేయాలంటే...  
 ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లేవారు, ఇతరత్రా వ్యక్తులు రేషన్ కార్డును సరండరు చేయాలంటే, సరండరు చేయడానికి గల కారణాలు పేర్కొంటూ దరఖాస్తు చేయడం, బదిలీ అయితే వాటి ఉత్తర్వులు, ఇతర రాష్ర్టంలో కొత్త నివాసం తెలిపేందుకు ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, నీటిపన్ను బిల్లు, ఓటరు కార్డు, అఫిడవిట్ జత చేయాలి.

 మార్పులు చేర్పుల కోసం...
 కొన్ని రేషన్ కార్డుల్లో ఎల్‌పీ గ్యాస్ కనెక్షన్ ఉంటే లేనట్లు, లేకుంటే ఉన్నట్లు వస్తోంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలంటే దరఖాస్తుదారుని అఫిడవిట్ గ్యాస్ డీలరు జారీ చేసిన గ్యాస్ కనెక్షన్ రశీదు, నివాస ధ్రువపత్రం (ఆధార్ కార్డు కరెంటు బిల్లు, ఓటరు కార్డు, ఇంటి పన్ను రశీదు) గ్యాస్ కనెక్షన్ లేకుంటే లేనట్లు అఫిడవిట్ సమర్పించాలి.

 డూప్లికేట్ కార్డు పొందాలంటే...
 పోగొట్టుకొన్న లేక చిరిగిన వాటి  స్థానంలో కొత్తగా డూప్లికేట్ కార్డు పొందాల్సిన వారు చిరిగిపోయిన రేషన్ కార్డు జిరాక్సు, పోయినట్టు ఎస్‌హెచ్‌ఓ రిపోర్టు, దరఖాస్తుదారుని సొంత డిక్లరేషన్, రేషన్ డీలరు నుంచి సరుకులు విడిపించుకోలేదని డీలరు ఇచ్చే ధ్రువీకరణపత్రం,  దరఖాస్తుదారుని అఫిడవిట్ జతచేయాలి.

 గ్యాస్ కనెక్షన్ కొత్తగా పొందాలంటే...
 నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు, ఆధార్ కార్డు, కరెంటు బిల్లు,  నీటి పన్ను బిల్లు, ఓటరు కార్డు, జతచేసి దరఖాస్తు చేస్తే సంబంధిత గ్యాస్ డీలరు కనెక్షన్ ఇస్తారు.

 రేషన్ కార్డు బదిలీ చేయడానికి...
 రేషన్ కార్డును ఒక చోట నుంచి మరొక చోటుకు బదిలీ చేసుకోవడానికి గల  కారణాలను తెలియజేస్తూ దరఖాస్తు, కొత్త ప్రాంతంలో నివసిస్తున్నట్లు ధ్రువీకరించేందుకు ఓటరు కార్డు జిరాక్సులు జతచేయాలి.

 తెలుపు కార్డును గులాబీగా  మార్చుకోవాలంటే
 ప్రస్తుతం ఉన్న తెలుపు కార్డును గులాబీ కార్డుగా మార్చుకోవాలంటే దరఖాస్తుతో పాటు ఆదాయ ధ్రువపత్రం కార్డుదారుని అఫిడవిట్/ నోటరీ / డిక్లరేషన్ ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డును జత చేసి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేయాలి. వీటిని జారీ చేసే అధికారం మండల స్థాయిలో తహశీల్దార్‌కి అప్పగించాలి.

 గులాబీ కార్డు  పొందాలంటే...
 గులాబీ కార్డు పొందాలంటే ఆధార్ కార్డు, విద్యుత్ / నీటి పన్ను రశీదు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లెసైన్సు, పాన్ కార్డు, అఫిడవిట్ / నోటరీ  జతచేసి  దరఖాస్తు చేస్తే తహశీల్దార్ గులాబీ కార్డు జారీ చేస్తారు.

 పేరు తొలగింపు ఇలా...
 రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు తొలగించాలంటే సంబంధిత సభ్యుని డిక్లరేషన్ పత్రం, అఫిడవిట్ / నోటరీ ఉండాలి. చనిపోయిన వ్యక్తి పేరు తొలగించాలంటే సంబంధిత వ్యక్తి మరణ ధ్రువపత్రం జతచేసి దరఖాస్తు చేసుకోవాలి.

 కుటుంబ యజమాని పేరు మార్చాలంటే...
 రేషన్ కార్డులో ప్రస్తుతం ఉన్న కుటుంబ యజమాని పేరు మార్చాలంటే కుటుంబ యజమాని / కుటుంబ సభ్యుల అంగీకార పత్రం, కొత్త ప్రాంతంలో నివసిస్తే తహశీల్దార్ జారీ చేసే ధ్రువీకరణ పత్రం, చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రం, ప్రస్తుతం ఉన్న ఒరిజనల్ రేషన్ కార్డు జతచేసి దరఖాస్తు చేయాలి.

Friday, September 19, 2014

టీనేజర్స్


లాటరీ .. తూచ్


మీ ఆధార్ కార్డులో తప్పులున్నాయా ?

 అన్ని ప్రభుత్వ పథకాలను ‘ఆధార్’కు అనుసంధానం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఈ తరుణంలో అందరికీ ఆధార్ కీలకంగా మారనుంది. మరి అంత ప్రాధాన్యమున్న మీ ఆధార్ కార్డులో తప్పులేమైనా ఉన్నాయా..! అధార్‌లో నమోదు చేసిన మీ ఫోన్ నెంబర్ మారిందా..! మీ పుట్టిన తేదీ తప్పుగా నమోదయిందా..! సరిచేసుకోవాలంటే ఏం చేయాలి..!  

►ఆధార్ కార్డ్‌లో మార్పులు, చేర్పులకు కొన్ని పరిమితులున్నాయి.
►కార్డ్‌లో ఫొటో మార్పు చేయలేము.
►ఆధార్ కార్డ్‌లో పేరు, లింగం (జెండర్), పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నెంబర్లను మార్పు చేసుకునే అవకాశం ఉంది.

ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు సందర్భాన్ని బట్టి రెండు (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) విధానాలున్నాయి.
 ఆన్‌లైన్ విధానంలో ఇలా..  
►ఇంటర్‌నెట్‌లో http://uidai.gov.in/updateyouraadhaardata.htmలింక్‌ను క్లిక్ చేయాలి.
►ఇక్కడ ‘అప్‌డేట్ డేటా ఆన్‌లైన్’ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.
►ఇక్కడ కొన్ని ముఖ్యమైన సూచనలు వస్తాయి. వాటిని చదవాలి.
►తర్వాత అప్‌డేట్, కరెక్షన్ రిక్వెస్ట్ ప్లీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
►ఇక్కడ మీకిచ్చిన ఆప్షన్‌లో మీ ఆధార్ కార్డ్ నెంబరును ఎంటర్ చేయాలి.
►దాని కింద ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేయాలి.
►అప్పుడు మీ మొబైల్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్  (ఓటీపీ) వస్తుంది.
►ఈ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగా మీరు ఏది మార్పు చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయాలి.
►ఇక్కడ సంబంధిత ఫారమ్ వస్తుంది.
►ఈ ఫారమ్‌ను పూరించాక సబ్‌మిట్ అప్‌డేట్ రిక్వెస్ట్‌ను క్లిక్ చేయాలి.
►తర్వాత డాక్యుమెంటేషన్ ఆప్షన్‌లో మీరు ఏదైతే మార్పు కోరుతున్నారో దానికి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
►తర్వాత మీకు అందుబాటులో ఉన్న సర్వీస్ ప్రొవైడర్‌ను సెలక్ట్ చేసుకుని ఎంటర్ చేయాలి.    
►ఇప్పుడు మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబరు వస్తుంది.
►ఈ నెంబరుతో మీరు మీ ఆధార్ ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు.
సూచనలు: వన్ టైమ్ పాస్‌వర్డ్‌కు కేవలం 15 నిమిషాలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది.
►ప్రాంతీయ భాషకు అనుగుణంగా సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి.
►ఫారమ్ పూరించేటప్పుడు ప్రాంతీయ భాషలో తప్పులు వస్తుంటే సంబంధిత ఆప్షన్ వద్ద కర్సర్‌ను పెట్టి కీ బోర్డులోని ట్యాబ్‌ను ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు అక్కడ కొన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో సరైంది సెలక్ట్ చేసుకోవాలి.
►5 ఏళ్ల లోపు పిల్లలకు పేరెంట్స్ సంతకం చేస్తే సరిపోతుంది.
►ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో రీఫ్రెష్ చేయకూడదు.
►మీరు దేనికైతే దరఖాస్తు చేసుకుంటున్నారో దాని డాక్యుమెంట్ పంపితే సరిపోతుంది. అన్ని పత్రాలు పంపాల్సిన అవసరం లేదు.
►పేరుకు ముందు ఎలాంటి విషయాన్ని ప్రస్తావించకూడదు.
     ఉదా: డా, శ్రీ, శ్రీమతి...
►అడ్రస్ చాలా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే అప్‌డేట్ అయిన ఆధార్‌ను ఆ అడ్రస్‌కు పంపుతారు.
►డేట్ ఆఫ్ బర్త్ మార్పునకు మాత్రం ఒక్కసారే అవకాశం ఉంటుంది.
►మొబైల్ నెంబరు మార్పు మాత్రం మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. దీనికి ఎలాంటి పత్రాలు రావు.

ఆఫ్ లైన్ విధానం (పోస్ట్‌ద్వారా...)
ఇంటర్ నెట్‌లో http://uidai.gov.in /images/ applicationform11102012.pdf లింక్‌ను క్లిక్ చేస్తే మీకు సంబంధిత దరఖాస్తు వస్తుంది.
►అందులో మీ వివరాలు పూరించి, సంబంధిత దరఖాస్తులను జత చేయాలి.
►దరఖాస్తును నిర్దేశిత కాలమ్‌లలో ప్రాంతీయ భాషలో కూడా పూరించాలి.
►ఒక ఎన్వలప్‌పై ‘రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అప్‌డేట్ అండ్ కరెక్షన్’ అని రాసి ప్రాంతీయ కార్యాలయానికి పోస్ట్‌లో పంపాలి.
సూచన: ఆన్‌లైన్ విధానంలో ఫారమ్ నింపే సమయంలో కొన్ని ఆప్షన్స్‌లో కరెక్ట్ అయిన పిన్‌కోడ్, విలేజ్, టౌన్, సిటి, పోస్ట్ ఆఫీస్, జిల్లా, రాష్ట్రం రాకపోతేనే ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేయాలి.
►అటెస్ట్ చేయాల్సిన పత్రాలు, పాటించాల్సిన నిబంధనలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలకు ఒక్కటే.

Follow on Facebook